telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్​లో నేను నటించడం లేదు… క్లారిటీ ఇచ్చిన హీరో

navadeep

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమా గురించి రోజు పుకారు బయటకొస్తోంది. టాలీవుడ్ నటుడు నవదీప్ ఈ చిత్రంలో నటిస్తున్నాడనే వార్త ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న నవదీప్ కండలు తిరిగిన తన దేహాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ కోసమే నవదీప్ ఇలా కండలు పెంచుతున్నాడనే టాక్ ముదిరింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ఆర్ఆర్ఆర్ లో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇది ఇలావుంటే ఇటీవలే ఆర్ఆర్ఆర్ టైటిల్ సీక్రెట్ రివీల్ చేస్తూ ‘రౌద్రం రణం రుధిరం’ అని ప్రకటించారు జక్కన్న. ఈ మేరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు రాజమౌళి.

Related posts