telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సతీమణి కోసం గరిట పట్టిన మెగా పవర్ స్టార్… వీడియో వైరల్

charan

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు తన భార్య ఉపసన మనసు ఎలా గెలుచుకోవాలో బాగా తెలుసు. తాజాగా రామ్ చరణ్ తన సతీమణి కోసం వంట చేశారు. ఈ వీడియోను ఉపాసన ట్విట్టర్లో షేర్ చేశారు. రామ్ చరణ్ వంట చేయడమే కాకుండా ఆ తరువాత పాత్రలను కూడా శుభ్రపరుస్తారని, అదే తనను ఇంట్లో హీరోగా కన్పించేలా చేస్తుందని ఉపాసన ట్వీట్ ద్వారా తెలిపారు. ఇక ఉపసన షేర్ చేసిన వీడియోలో రామ్ చరణ్ కొన్ని కూరగాయలను, పనీర్‌ ను కలిపి ఫ్రై చేస్తుండడం కన్పిస్తోంది. రామ్ చరణ్, ఉపాసన 2012 లో వివాహం చేసుకున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు హెల్త్ వీడియోలను షేర్ చేస్తుంటారు. ఆమె షేర్ చేసిన ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికొస్తే… తాజాగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్ లతో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. “ఆర్‌ఆర్‌ఆర్‌”లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనున్నారు.

Related posts