telugu navyamedia
సినిమా వార్తలు

సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ 28వ ప్రాజెక్ట్

Gopichand

కెరీర్ మొదట్లో విలన్ గా అదరగొట్టిన మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లో “చాణ‌క్య” అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు.ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇక బిను సుబ్రమణ్యం అనే కొత్త ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లోను ఓ సినిమా చేస్తున్నాడు గోపిచంద్. తాజాగా గోపిచంద్ 28వ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ 28వ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రాన్ని సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు. సంప‌త్ నంది- గోపి చంద్ కాంబినేష‌న్‌లో గౌతమ్ నందా అనే చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. 2017లో విడుద‌లైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ పొందింది. తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

Related posts