telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేమ కోసం ఇల్లే తగలబెట్టుకున్నాడు… కానీ ప్రేమను జయించాడు

Love Proposal

లవ్ ప్రపోజ్ చేయడానికి ఓ యువకుడు చేసిన పనికి ఇల్లే తగలపడి పోయింది. ఇల్లంతా కొవ్వొత్తులు వెలిగించి ప్రపోజ్ చేయాలనుకుంటే.. కొవ్వొత్తుల కారణంగా ఏకంగా మంటలు చెలరేగి ఇల్లు తగలబడి పోయింది. ఇదంతా చూసిన ప్రియురాలు అతడి ప్రేమను అంగీకరించింది. షెపీల్డ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలిని ప్రేమించాడు. ఓ సారి సడన్ సప్రైజ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తాను నివసించే అపార్ట్మెంట్ ను చక్కగా ముస్తాబు చేశాడు. వందలాది కొవ్వొత్తులు ముట్టించి బెలూన్లు తెప్పించి డెకరేట్ చేశాడు. గ్లాసుల్లో వైన్ కూడా పోసి అంతా సిద్ధం చేశాడు. ఆమెకు గ్రాండ్ పార్టీ ప్రపోజ్ చేయాలనుకున్నాడు. స్నేహితురాలిని తీసుకొచ్చేందుకే ఆమె దగ్గరికి వెళ్ళాడు. కాసేపటికి ఇద్దరూ రాగా అప్పటికే ఇల్లు తగలబడి పోతోంది. మూడు వాహనాల్లో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. దీంతో ఆ యువకుడు షాక్ తిన్నాడు. కొవ్వొత్తులతో మంటలు చెలరేగి ఉంటాయని గ్రహించాడు. అప్పుడతనికి ఓ ఆలోచన వచ్చి తన స్నేహితురాలిని ఆరిన ఇంటి శిథిలాల్లోకి తీసుకెళ్లి లవ్ ప్రపోజ్ చేశాడు. తన కోసం ఇంత చేసి అన్ని పాట్లు పడ్డ ఆ యువకుడి ప్రేమను ఆమె మన్నించింది. ‘ఐ టూ లవ్ యూ ‘ అంటూ చెప్పేసింది. ఇదంతా చూసిన అగ్నిమాపక సిబ్బంది ఆ దృశ్యాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది. ప్రేమ ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైందని కొందరు, ఏ రింగో ఇవ్వకుండా కొవ్వొత్తులతో ఇల్లే తగలేసావ్ అంటూ మరి కొందరు సరదాగా అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.

Related posts