telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రధాని మన్ కీ బాత్ నేపథ్యంలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

Rahul gandhi congress

ప్రధాని నరేంద్ర మోదీ 69వ మన్ కీ బాత్ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్రం రూ.80 కోట్లు ఖర్చు చేయగలదా? అని ప్రశ్నించారు.

అదర్ పూనావాలా అడిగిన ప్రశ్న సరైనదేనని రాహుల్అభిప్రాయపడ్డారు. పూనావాలా ప్రశ్నకు సమాధానం కోసం భారతీయులు ఇంకెంత కాలం వేచి చూడాలని అని రాహుల్ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం కరోనా వ్యూహం కూడా మనసులో మాట (మన్ కీ బాత్) అయ్యుంటుందేమోనని దూయాబట్టారు.

అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో వర్చువల్ ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల దేశం భారత్ అని చెప్పారు. ప్రపంచ దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించడంలో భారత్ తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Related posts