telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కేసీఆర్ కు మమతా ఫోన్..ర్యాలీకి రమ్మని ఆహ్వానం!

mamatha as pm candidate from trunamul congress
తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం  కేసీఆర్ కు ఈరోజు ఫోన్ చేశారు. శనివారం కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా ర్యాలీకి హాజరుకావాలని ఈ సందర్భంగా ఆమె ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన 20 మందికి పైగా నేతలు హాజరు అవుతున్నట్లు మమత కేసీఆర్ కు వివరించారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం ఆమె పరిశీలించారు.
రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాలనే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మమతా బెనర్జీతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ లతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును కేసీఆర్ ప్రతిపాదించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటున్న ఈ ర్యాలీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related posts