telugu navyamedia
వార్తలు సామాజిక

మహారాష్ట్రలో కొనసాగుతున్న కోవిడ్.. ఒక్క రోజే 2,598 కేసుల నమోదు!

Corona

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభించడంతో రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,598 కేసుల నమోదుకాగా, 105 మంది మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా నిన్న సంభవించిన మరణాల్లో ఇది 54 శాతం కావడం గమనార్హం. గత 24 గంటల్లో 130 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ బారినపడిన పోలీసుల సంఖ్య 2,095కి చేరుకుంది. 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2,598 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 56,948కి పెరగ్గా, 1,897 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు, బీహార్, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీలలోనూ కరోనా విజృంభిస్తోంది. బీహార్‌లో మొత్తం కేసుల సంఖ్య 3 వేలు దాటగా, ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా గత 24 గంటల్లో ఏకంగా 443 కేసులు వెలుగుచూశాయి. వలస కార్మికుల రాకతో ఇక్కడ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.

Related posts