telugu navyamedia
రాజకీయ

కేరళలో వర్ష బీభత్సం..

కేరళ రాష్ట్రంలో ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నా యి. ప్రధానంగా దక్షిణ, మధ్య కేరళలోని జిల్లాలపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. పథనంతిట్ట, కొట్టాయంలతో పాటు ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలు వర్షం భీభత్సంతో అల్లాడిపోయాయి.

Heavy rains have lashed Kerala, causing landslides, waterlogging. (Image of landslide from Pullupara: News18)

భారీ వర్షాలకారణంగా రాష్ట్రంలో ఇంతవరకు 6గురు మరణించగా 15 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో 6 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ

రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి తీవ్రంగా ఉందని సీఎం పినరాయి విజయన్‌ అన్నారు. పోలీసు, అగ్నిమాపక దళానికి చెందిన సహాయ బృందాలు వరద ఉద్ధృతి, వాతావరణ పరిస్థితి అనుకూలించక ప్రభావిత ప్రాంతాలకు చేరుకోలేకపోయాయి.

ఇవాళ, రేపు శబరిమలలో దర్శనం రద్దు..  భక్తులు రావొద్దన్న ట్రావెన్‌కోర్‌ బోర్డు

అయితే భారీ వర్షాల కారణంగా అయ్యప్ప భక్తులెవరూ కూడా ఈరోజు, రేపు శబరిమల దర్శనాన్ని ఈరోజు రేపు తాత్కాలికంగా రద్దు చేశారు.శబరిమలకొండకు వచ్చే మార్గాల్లో కొండచరియలు విరిగి పడటంతో భక్తులు శబరిమలకు రావద్దని ట్రావెన్ కోర్ దేవస్ధానం బోర్డు భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Related posts