telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఒకేసారి 1088 అంబులెన్స్‌లను ప్రారంభించిన జగన్

jagan ambulence vijayawada

అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 108,104 అంబులెన్స్ లను ఏపీ సీఎం జగన్‌ ప్రారంభించారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జెండా ఊపి 1088 అంబులెన్స్‌లను ఒకేసారి ప్రారంభించారు. రూ.201 కోట్లతో 1068 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వేలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పుడు మరింతగా విస్తరించామని అన్నారు. 95 శాతానికి పైగా కుటుంబాలకు ఆరోగ్య భద్రతపై భరోసాను కల్పించామని అన్నారు. ఈ అంబులెన్స్ ల ద్వారా 108, 104 సేవలు ప్రతి ఒక్కరికీ దగ్గరవుతాయని తెలిపారు. ఇందులో 26 అంబులెన్స్ లు చిన్నారుల కోసం నియో నేటల్ వైద్య సేవల నిమిత్తం కేటాయించామని తెలిపారు. వీటితో పాటు ఇన్ క్యుబేటర్, వెంటిలేటర్లతో కూడిన అంబులెన్స్ లు కూడా ఉన్నాయని తెలిపారు. గతంలో ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండగా, ఇప్పుడు 74,609 మందికి ఒక అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.

Related posts