telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ఎస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌…

 

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. ఆదివారం నుంచి ఈ నెల 22 వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు.

ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు వెల్లడించారు.

TRS party releases state presidential election schedule

అక్టోబ‌ర్ 25 వ తేదీన‌ హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక న ఎన్నిక‌లు నిర్వహిస్తారు. ఎంపిక అనంత‌రం, ప్లీన‌రీని నిర్వ‌హిస్తారు. ఈ ప్లీన‌రీకి 13 వేల మందికి పైగా ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతార‌ని పార్టీ ప్ర‌క‌టించింది. హైటెక్స్‌లో ఈ ఎన్నిక‌ల నిర్వ‌హాణ‌, ప్లీన‌రీ ఉంటుంది.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం చేపట్టనున్నారు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కోలాహలం నెలకొన్నది.

నామినేషన్ల స్వీకరణకు తేదీలు..

*22 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.
*23 న స్క్రూటినీ ఉంటుంది
*24 న నామినేషన్ల ఉపసంహరణ
*ఈనెల 25 న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ.
* ఇదే రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది

 

Related posts