telugu navyamedia
ఆంధ్ర వార్తలు

4 రాజ్య‌స‌భ స్థానాల భ‌ర్తీకి వైసీపీ క‌స‌ర‌త్తు..విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం

*జూన్ 10న రాజ్య‌స‌భ ఖాళీల‌కు ఎన్నిక‌లు..
*ఏపీ నుంచి 4 రాజ్య‌స‌భ స్థానాల భ‌ర్తీకి వైసీపీ క‌స‌ర‌త్తు..
*ప‌రిశీల‌న‌లో విజ‌య‌సాయిరెడ్డి, ఆర్‌.కృష్ణ‌య్య, నిరంజన్ రెడ్డి,బీద మ‌స్తాన్‌రావు పేర్లు
*తాడేప‌ల్లి కి ఆర్‌.కృష్ణ‌య్య కు బీద మ‌స్తాన్‌రావు..
*ఈ నెల 24 న నోటిఫికేష‌న్‌, నామినేష‌న్ల‌కు తుది గ‌డ‌వు మే 31 ..

వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డికి మళ్లీ అవకాశం దక్కనుంది.

రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ..సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు. మరో రెండు సీట్లలో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీదమస్తాన్ రావుకి ఒక్క సీటు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు ఇంకో సీటు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..రాష్టం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది.

ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు.

నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

Related posts