కడప జిల్లా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాధ్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. కమలాపురంలో రామపురం గుడి వద్ద నిలిపి ఉన్న ఆయన కారును ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామని కాగితాలపై రాసి కారుకు అంటించారు.
అంతేకాకుండా ఆయన ఇంటిగోడల మీద, గేట్లకు కరపత్రాలు అంటించారు. అందులో ఒరేయ్ సాయి నీ అంతు చూస్తాము. నిన్ను తొందరలో హతమారుస్తాము.. ఒరేయ్ సాయి, చావుకు సిద్ధంగా ఉండు’’ అంటూ అని పేపర్లలో రాసి ఉంది.
ఇక, ఈ ఘటనకు సంబంధించి సాయినాథ్ శర్మ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ పని ఎవరైనా ఆకతాయిలు చేశారా..? లేక ఎవరైనా కావాలనే చేశారా..? అనేది తెలియాల్సి ఉంది.
కాగా..రేపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమలాపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సాయినాధ్ శర్మ ఇంటి గోడలపై బెదిరింపు కరపత్రాలు కనిపించడం రాజకీయంగా ఉత్కంఠ నెలకొంటుంది.
కమలాపురం మండలం రామాపురం లోని సాయినాథ్ శర్మ కారు ధ్వంసం… రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామంటూ చేతి రాతతో పాంప్లెట్లు కారుకు అంటించిన దుండగలు @naralokesh @ncbn @iTDP_Official @JaiTDP @ysjagan @YSRCParty @abnandhrajyothy @TV9Telugu @sakshitv1 @tv5newsnow pic.twitter.com/8rppYYK5Zz
— SREEDHAR B (@sree_b77) May 17, 2022
ఆ విషయం పవన్ కల్యాణ్ కు ఎప్పుడో చెప్పాను: జయప్రకాష్