telugu navyamedia
రాజకీయ

లెనిన్‌-ఎం.ఎన్ రాయ్ సంబంధం – నెహ్రూ పాత్ర‌

సోనియ‌న్ విప్ల‌వ విజేత లెనిన్‌తో దీటుగా అగ్ర‌స్థాయి సంఘంలో మాస్కోలో నిల‌చిన ఎం.ఎన్ రాయ్ ఆశ్చ‌ర్య‌క‌ర పాత్ర వ‌హించాడు. లెనిన్ కు మార్గాంత‌ర సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించి, గుర్తింపు పొంది, సోవియ‌ట్ యూనియ‌న్ లో గౌర‌వం చేకూర్చుకున్న ఎం.ఎన్‌.రాయ్ గౌర‌వం చేకూర్చుకున్న ఎం.ఎన్‌.రాయ్ ఆసాధార‌ణ పాత్ర నిర్వ‌హించాడు. ఇదంతా ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం అయినా ఆనాటి ప‌రిస్థితుల వ‌ల‌న వెంట‌నే భార‌త‌దేశానికి తెలియ‌లేదు.

M.N. Roy in Mexico | The Mex Files

అయితే ఎం.ఎన్ రాయ్ పాత్ర గురించి తెలిసిన జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ఆయ‌న్ను క‌లుసు కోవాల‌నుకున్నాడు.1927లో మాస్కో వెళ్ళిన‌ప్ప‌డు రాయ్ నెహ్రూలు క‌లిశారు.

ఇదంతా నాటి ప‌రిస్థితుల వ‌ల‌న ప్రాధాన్య‌త పొంద‌లేదు. మెక్సికోలో విప్ల‌వ పాత్ర నిర్వ‌హించిన రాయ్‌ను లెనిన్ గుర్తించి, మాస్కో ఆహ్వానించి త‌న‌తో స‌మానంగా క‌మిటీలో స్థానం ఇచ్చాడు. ఇండియాలో నాటి క‌మ్యూనిస్టుల‌కు ఇదంతా కంట‌కంగా ఉంది.

అయితే రాయ్‌ను క‌లుసుకోవాల‌నే కోరిక‌ను మాస్కో సంద‌ర్శ‌నం ద్వారా నెహ్రూ తీర్చుకున్నాడు. ఆ త‌రువాత రాయ్ ఇండియా రావ‌డం, జైలు శిక్ష అనుభ‌వించి బ‌య‌ట‌కు రావ‌డం చ‌రిత్ర అప్పుడు జ‌వ‌హర్ లాల్ ఫైజ్ పూర్ కాంగ్రెస్‌లో రాయ్‌ను క‌ల‌సి, కొన్నాళ్ళు అల‌హాబాద్‌లో త‌న అతిథిగా ఉండ‌మ‌న్నాడు. అంగీ క‌రించి, నెహ్రూతో గ‌డ‌పి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించిన రాయ్‌, కాంగ్రెస్‌లో చేరాడు.

The Roy-Lenin debate on colonial policy | The Daily Star

నెహ్రూ కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడుగా గాంధీకి వార‌సుడ‌య్యాడు. రాయ్ స్వతంత్రంగా మాన‌వ‌వాదాన్ని పెంపొందించాడు. నెహ్రూ పాత్ర‌ను నిశితంగా ప‌రిశీలించిన‌, రాయ్‌, కాంగ్రెస్ రాజ‌కీయాల‌లో ఆయ‌న పాత్ర‌ను గ‌మ‌నిస్తూ వ‌చ్చాడు. నెహ్రూ త‌ట‌ప‌టాయింపు రాజ‌కీయాల‌ను వ్యాఖ్యానిస్తూ , హామ్లెట్‌గా చిత్రించాడు. ఉందామా? వ‌ద్దా అనే హామ్లెట్‌తో నెహ్రూను పోల్చుతూ రాయ్ రాశాడు.

వార‌ద్ద‌రి సంబంధం మిత్ర‌త్వంగానే సాగింది. ఎవ‌రి రాజ‌కీయాలు వారివి, చ‌రిత్ర‌లో ఈ విష‌యాలు ఆస్త‌కిక‌ర‌మైన‌వి..!

డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య

అమెరికా..

Related posts