telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

90 రోజులపాటు ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన

PM kalyan yojana

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం  దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఈ పథకం మార్చి 30 నుంచి 90 రోజులపాటు అమల్లో ఉంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుధాన్‌ పేర్కొన్నారు.

కరోనా రోగుల వైద్య సవలో నిమగ్నమైన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలోని 22.12 లక్షల మందికి బీమా రక్షణ లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైద్యులు, ఇతర సిబ్బంది వాటి బారిన పడే ప్రమాదం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

Related posts