telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కియా సెల్టోస్ … రోజా సంతకంతో …

kia celtos car released by AP ministers

వెలుగులు విరజిమ్ముతూ కియా సెల్టోస్ ఎస్ యూవీ మోడల్ కారు జిల్లాలోని పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ లో కనువిందు చేసింది. నారింజ, తెలుపు మిశ్రమంతో కూడిన సెల్టోస్ కారును రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారుపై రోజా తొలి సంతకం చేశారు.వెస్ట్ విషెష్ అంటూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన రెండో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ యాజమాన్యం ఈ కారును రూపొందించింది.

త్వరలోనే సెల్టోస్ కారు దేశంలోని అన్ని షోరూమ్ లల్లో అందుబాటులోకి రానున్నాయి. నిజానికి- ఈ తొలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాల్సి ఉంది. ఢిల్లీ పర్యటనలో వైఎస్ జగన్ తీరిక లేకుండా ఉండటం వల్ల రాలేకపోయారని మొదట్లో వార్తలు వచ్చాయి. అవి నిజం కాదని తేలిపోయింది. వైఎస్ జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉన్నందున ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. తనకు బదులుగా మంత్రులను ఈ కార్యక్రమానికి పంపించారు. కారును ఆవిష్కరించడం కంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడం, బాధితులకు తక్షణ సహాయాన్ని అందజేయడంపైనే వైఎస్ జగన్ దృష్టి పెట్టారని, అందువల్లే కారు ఆవిష్కరణకు రాలేదని మంత్రులు తెలిపారు.

Related posts