*రష్యా సైన్యం ఆధీనంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్!
* ఉక్రెయిన్ ను ఆక్రమిస్తున్న రష్యా..
*కీవ్‌పై బాంబుల వర్షం..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు అధునాతన ఆయుధాలతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌ను దాదాపు స్వాధీనం చేసుకునే స్థితికి వచ్చేశాయి.
రష్యా సైనికులు కీవ్‌లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఏ క్షణంలోనైనా కీవ్ రష్యా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. రష్యన్ ట్యాంకర్లు, బలగాలు శుక్రవారం తెల్లవారుజాము సమయానికే శివారు ప్రాంతాలకు చేరుకున్నాయి. కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు, తూటాల వర్షం కురిపించాయి.
తాజాగా రాజధానిలోని విక్టరీ అవెన్యూ సైనిక స్థావరంపై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. అయితే దాడులను తిప్పికొడుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం ఫేస్బుక్ వేదికగా వెల్లడించింది.
మరోవైపు..కీవ్ నగరానికి ఉత్తరాన కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే రాష్ట్ర రాజధానిలోని ప్రభుత్వ క్వార్టర్, కీలక ప్రాంతాలనులక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నాయి. సిటీ సెంటర్ లోని సబ్ స్టేషన్ నుంచి బయటకు రావద్దని, ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయని స్థానిక పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
ఈ విషయం తెలిసి.. కీవ్ వాసులు గురువారం రాత్రి పొద్దుపోయేవరకు అండర్ గ్రౌండ్ కు వెళ్లి తలదాచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా భూఉపరితలంపై చోటుచేసుకున్న అతిపెద్ద యుద్ధంగా నిపుణులు తెలుపుతున్నారు.