telugu navyamedia
రాజకీయ వార్తలు

24 గంటల్లో మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం!

gopal bhargava bjp

బీజేపీ హైకమాండ్ అనుమతిస్తే 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే గోపాల్‌ భార్గవ ఆ రాష్ట్ర శాసనసభలో అన్నారు. బీజేపీలోని నంబర్‌ 1, నంబర్‌ 2 గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. కమల్‌నాథ్‌ ప్రభుత్వం 24 గంటల్లో పడిపోవడం ఖాయమన్నారు. ఈ ఏడు నెలలే కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని నడపడం ఎక్కువైపోయిందన్నారు. అయితే భార్గవ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ స్పందించారు. ప్రభుత్వాన్ని కూలదోయడం జరగదన్నారు.

కానీ నంబర్‌ 1, నంబర్‌ 2 ఏవరో చెప్పాలని కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు అమ్ముడుపోరని చెప్పారు. బీజేపీ బలపరీక్షకు సిద్ధమైతే తాము కూడా సిద్ధమని కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన తేల్చిచెప్పారు. 231 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో 114 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 115. అయితే బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Related posts