telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు: కేసీఆర్‌

Un-employee allowance shortly telangana

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. ప్రతీనెల రైతులపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులకు నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సీఎం పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేయగా బ్యాంకర్లు రైతులను ఇబ్బందిపెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదును జమ చేయగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్‌ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగినట్టు చెప్పారు.

మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సీఎం సన్నాహాలు చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండానే రైతుబందు కింద రూ.10వేలు ఇస్తామని పేర్కొన్నారు. పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.50వేల కోట్లకు పైగా నిధులు పోతున్నాయని, రాష్ర్టానికి రూ.24వేల కోట్ల దాకా తిరిగి వస్తున్నాయని కేసీఆర్‌ వివరించారు.

Related posts