telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజులు రిమాండ్‌..

*ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజులు రిమాండ్‌
*వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో రాజాసింగ్‌కు రిమాండ్‌
*రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజ‌రుప‌ర్చిన‌ పోలీసులు
*రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై వివిధ పీఎస్‌ల్లో ఫిర్యాదులు
*భారీ బ‌ద్ర‌త న‌డుమ రాజాసింగ్ కోర్టుకు త‌ర‌లింపు..
*చంచ‌ల్ గూడ జైలు వ‌ద్ద భారీ భందోబ‌స్తు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.వివాదస్పద వ్యాఖ్యలు చేసిన 14 వ అదనపు . రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. . రాజాసింగ్‌ తరపు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది . కోర్టు ఆదేశాల మేర‌కు రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మ‌ల‌క్‌పేట్‌, చార్మినార్ వెళ్లే దారుల‌తో పాటు చంచల్‌గూడ జైలు ప‌రిస‌రాల్లో  పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు

రాజాసింగ్ సోషల్ మీడియాలో మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా వ్యాఖ్యలు  చేసిన వీడియో వివాదాస్పదం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు .

దీంతో రాజాసింగ్‌కు మద్దతుగా భారీగా కోర్టు ఆవరణలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు.దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల వారిని అడ్డుకున్నారు..

ఈ క్ర‌మంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది..అయితే ఆందోళనకారులను చెదరగొడుతున్నారు పోలీసులు. ఉద్రిక్తతల నేపథ్యంలో నాంపల్లి కోర్టు సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

మరోవైపు మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు వేసింది బీజేపీ. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అన్ని బాధ్యతల నుంచి తప్పించింది. శాసనసభ పక్ష నేత పదవి నుంచి తొలగించింది.

Related posts