telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ జైలుకి…

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ రోడ్‌షో నిర్వ‌హించిన ఆయ‌న‌ మాట్లాడుతూ.. రౌడీలకు, గూండాలకు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు..  తల, కాళ్ళు, చేతులు నరికేటోళ్లకు టికెట్లు ఇచ్చారని విమర్శించిన ఆయ‌న‌.. తలలు నరికే పార్టీ కావాలా..? ఓరుగల్లును అభివృద్ధి చేసే పార్టీ కావాలా..? ప్రజలు ఓటేసేప్పుడు ఆలోచించుకోవాల‌న్నారు. రాంపుర్ డంప్ యార్డ్ నుండి చెత్త చెదారం వచ్చి వడ్డేపల్లి చెరువులో చేరుతున్నాయ‌న్న బండి సంజ‌య్.. ఆ నీటిని తాగునీటికి సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు.. తమకు అవకాశం ఇస్తే మంచినీటిని సరఫరా  చేస్తామ‌న్నారు.. ఇక‌, కోవిడ్ స‌మ‌యంలో.. ఆక్సిజ‌న్ ప్లాంట్ల కోసం కోట్లు కోటాయిస్తున్నామ‌న్నారు సంజ‌య్.. కేంద్ర ప్రభుత్వం జీరో అకౌంట్‌లో పైసలు ఇస్తున్నారని చెప్పారు.. కేసీఆర్ కుటుంబం మాత్రం అక్రమంగా దోచుకున్న డబ్బును విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంది.. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతుంది అని హెచ్చ‌రించారు.

Related posts