telugu navyamedia
సినిమా వార్తలు

“ఖైదీ”గా మారబోతున్న కార్తీ

Kharthi-Khaidi

1983లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఖైదీ” చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా చిరంజీవి అభిమానులనే కాకుండా తెలుగు సినిమా ప్రియులందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్న చిత్రమిది. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ను తమిళ హీరో కార్తీ తన సినిమా కోసం ఉపయోగించుకుంటున్నాడు. కార్తి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి “ఖైదీ” అనే పేరును ఖరారు చేశారు. అంతేకాదు రక్తంతో నిండిన జైలు ఊచల వెనుక కార్తీ ముఖం ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసేసింది చిత్రబృందం. ఇది పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని, హై స్టాండర్డ్స్ ఉన్న టెక్నీషియన్స్, నటీనటులతో ఈ సినిమా కోసం కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని కార్తి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాలో హీరోయిన్ వుండదని అంటున్నారు. ఇక “ఖైదీ” టైటిల్ తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది.

ఇక చిరంజీవికి సంబంధించిన హిట్ చిత్రాల టైటిల్స్ ను టచ్ చేయడానికే మెగా కాంపౌండ్ హీరోలు భయపడుతున్నారు. కానీ ఇతర హీరోలు మాత్రం ఆ టైటిల్స్ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే “గ్యాంగ్ లీడర్” టైటిల్ పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Related posts