మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు.
యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవల మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. హీరోయిన్స్ తో ఉన్న సరికొత్త రొమాంటిక్ పోస్టర్ ను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలో ‘జిన్నా’ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో టెంట్ హౌజ్‌కు ఓనర్‌గా మంచు విష్ణు ఈ చిత్రంలో కనిపించనున్నాడు.
జిన్నా టైంకు రావడంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తుంటాడు అంటూ ఇందులో విష్ణు క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు .హాట్ బ్యూటీలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ తమ అందచందాలతో కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ చూసి సినీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఏ పని చేయకుండా.. ఊరంత అప్పులు చేస్తూ గడుపుతున్నా విష్ణు లైఫ్‌లోకి సన్నీలియోని ఎంట్రీ ఇస్తుంది. అయితే సన్నీలియోనికు దెయ్యం పట్టినట్లు ఈ టీజర్ లో చూపించారు. ఆ దయ్యం కథ ఎలా ఉండబోతుంది? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ టీజర్ చూస్తుంటే మంచు విష్ణు ఖాతాలో హిట్ పడ్డట్లే కనిపిస్తోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా సందర్భంగా.. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్న బిగ్ బాస్… తూ… : శ్రీరెడ్డి