telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నేడు ప్రమణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్సీ కవిత

kavitha trs

కల్వకుంట్ల కవిత ఇవాళ ఎమ్మెల్సీ పదవీకి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాగిగ్గా మధ్యాహ్నం 12.45 నిమిషాలకి ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలంగాణ శాసన మండలి లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తలందరూ మంచి ఊపులో ఉన్నారు. కాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు. 10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం రెండు రౌండ్లలో కౌంటింగ్ జరగ్గా..రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పూర్తి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ లోనే గెలుపునకు కావలసిన మెజారిటీ సాధించి, విజయ ఢంకా మోగించారు కల్వకుంట్ల కవిత.

Related posts