telugu navyamedia
క్రీడలు వార్తలు

తండ్రి కాబోతున్న భారత మాజీ ఫాస్ట్ బౌలర్…

భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు జహీర్. ట్విట్టర్ వేదికగా ”మా ఇంట్లోకి త్వరలో మూడో మనిషి రాబోతున్నాడు” అని జహీర్ తెలిపాడు. అయితే జహీర్ బాలీవుడ్ నటి సాగరికా ఘాట్గే ను 2017 లో వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. సాగరికా ‘చెక్ దే ఇండియా’ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. ఇక జహీర్-సాగరికా ప్రస్తుతం యూఏఈ లో ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా యూఏఈ లో జరుగుతుంది. అయితే జహీర్ ముంబై ఇండియన్స్ జట్టుకి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఈ ఐపీఎల్ టోర్నీకి కేవలం ముంబై జట్టు ఆటగాళ్లు మాత్రమే తమ కుటుంబీజ సభ్యులతో కలిసి యూఏఈ వెళ్లారు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ తాను తండ్రి కాబోతున్నట్లు వచ్చే ఏడాది జనవరిలో తన భార్య అనుష్క ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపాడు.

Related posts