telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏఎన్నార్‌ అండ్‌ విజన్‌… అన్నపూర్ణ స్టూడియోస్ లో మరో కొత్త విభాగం

Annapurna

అన్నపూర్ణ స్టూడియోస్‌ తాజాగా సాంకేతికంగా మరో అడుగు ముందుకు వేసింది. ఏఎన్నార్‌ అండ్‌ విజన్‌ ప్రస్తుతం డాల్బీ అట్మాస్‌ హోమ్‌ సర్టిఫైడ్‌ అయినట్లుగా చెబుతూ… అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ తమ అఫీషియల్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది. ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసమే డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ మిక్స్‌ తీసుకున్నట్లుగానూ, దీనికి డాల్బీ అట్మాస్‌ హోమ్‌ సర్టిఫైడ్‌ చేసినట్లుగా తెలిపారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్‌ హైదరాబాద్‌లో ప్రముఖంగా వినిపించే పేరు. అన్నపూర్ణ స్టూడియోస్‌ కేవలం షూటింగ్స్ నిమిత్తమే కాకుండా అందులో అనేక భాగాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ మీడియా, ఏఎన్నార్‌ సౌండ్‌ అండ్‌ విజన్‌ ఇలా అనేక విధాలుగా సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు ఆ సంస్థలో జరుగుతుంటాయి.

Related posts