telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హీరోయిన్

Poonam-Bajwa

హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్‌ మీడియా ద్వారా తన లవర్‌, సోల్‌మేట్‌ సునీల్‌రెడ్డిని పరిచయం చేసింది పూనమ్‌. “సునీల్‌ రెడ్డి, మై రూట్స్‌, గ్రౌండ్‌, హ్యండ్సమ్‌, మంచి హృదయమున్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌మేట్‌కు హ్యాపీబర్త్‌డే. నీతో ఉండే ప్రతీ క్షణం ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది.. హ్యాపీ బర్త్‌ డే” అంటూ తన ప్రియుడిపై ప్రేమను పూనమ్‌ వెల్లడించింది. సునీల్‌ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలను పూనమ్‌ పోస్ట్‌ చేసింది. త్వరలోనే పూనమ్‌ పెళ్లి చేసుకోబోతుందని ఈ ఫొటోలను చూసిన వారందరూ అంటున్నారు. ఇక 2005లో వచ్చిన “మొదటి సినిమా” ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన పూనమ్, అక్కినేని నాగార్జునతో బాస్, భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. 

Related posts