ఫేస్‌బుక్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ.. తమ మార్కెట్‌ను పెంచుకుంటూపోతోంది. దాని తగ్గట్టు గానే.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌బీని ఉపయోగించేవారు కోకొల్లలు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టూల్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ ఖాతాలోని ఫోటోలను ఈజీగా గూగుల్ అకౌంట్లలోకి మార్చుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్ పైలెట్ స్టేజిలో ఉండగా.. ఐర్లాండ్‌లోని కొంతమంది యూజర్లకు ఈ టూల్ ఇప్పటికే అందిస్తోంది. ఇది గనక సక్సెస్ అయితే.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌బీ ఉపయోగిస్తున్న అందరికి అందుబాటులోకి తీసుకురానుంది. కాగా, ఈ టూల్‌ను డేటా ట్రాన్స్‌ఫర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది.
సికింద్రాబాద్ అభివృద్ధే తన లక్ష్యం: కిషన్ రెడ్డి