telugu navyamedia
సినిమా వార్తలు

స్నేహనికి దిష్టి పడకుండా ఉండాలి…నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలంటూ..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఆదివారం కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‏లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ కామెంట్స్ చేశారు. అందరికీ నమస్కారం.. కర్ణాటక సీఎం కు, శివరాజ్ కుమార్ అన్నకు ధన్యవాదాలు తెలిపాడు.

ముందుగా ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా ప్రసంగించారు. పునీత్ సర్ ఇక్కడ లేరని నేను అనుకోను.. ఆయన పార్థివేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు నాకు అనిపించింది.. ఈ గాల్లో.. నేలకు.. మట్టిలో ఆయన ఉన్నట్టు అనిపించింది. అందుకే ఈరోజు ఈ చల్లని సాయంత్రం ఆయన ఓ వర్షపు చినుకుల రూపంలో, చల్లని గాలి రూపంలో ఆయన మన పక్కనే ఉన్నారని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు.

పునీత్ సర్ మనతో లేడని నేను ఎప్పుడు ఏడ్వలేదు.. పునీత్ సర్ సెలబ్రెషన్స్.. జేమ్స్ రూపంలో సెలబ్రేషన్ కూడా అందించారని.. అందుకే ఆయన మన మధ్యలో లేరని ఎవరూ బాధపడొద్దని ఎన్టీఆర్ తెలిపాడు.. నేను కన్నడలో మాట్లాడితే చూడాలని మా అమ్మ కోరం..

ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ మూవీ కేవలం సినిమా కాదని.. తమ ముగ్గురి మధ్య ఉన్న బంధమని అభివర్ణించాడు.ఆర్ ఆర్ ఆర్‌ టైటిల్‌ను దేవుడే నిర్ణయించి ఉంటాడని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇది కేవలం చిత్రం కాదని.. తన సినిమాల ద్వారా భారతదేశం యూనిటీ చాటాలని తాపత్రయపడుతున్న ఓ గొప్ప దర్శకుడి కల అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు.

రాబోయే తరాలకు నిదర్శనంగా నిలిచిపోయే ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్‌ అని తెలిపాడు. జక్కన్న కట్టబోయే రామసేతు లాంటి నిర్మాణంలో ఉడత లాంటి తనకు ఓ పాత్ర ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు.

Jr NTR speech at RRR Pre release event

నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు నా అభిమానులు. మీ అభిమానంతోపాటు.. నా బ్రదర్ చరణ్ అభిమానులు మాకు దక్కారు. ఎల్లప్పుడూ మీ అందరూ.. ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు.. ఇంత ఒపిగ్గా ఎదురుచూస్తున్నందుకు పాదాభివందనం.. చెర్రీతో ఈ బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. మా సాన్నిహిత్యం, స్నేహనికి దిష్టి పడకుండా ఉండాలని.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ భావోద్వేగమయ్యారు ఎన్టీఆర్..

ద‌య‌చేసి ఇంటికి జాగ్ర‌త్త‌గా వెళ్ళండి..మీ ఇంట్లో మీ కుటుంబ స‌భ్యులు ఎదురు చూస్తుంటార‌ని అని స్పీచ్ ముగించే ముందు అభిమానుల‌కు ఎన్టీఆర్ చెప్పారు.

Related posts