telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా విక్టరీ వెంకటేష్

Jersey1

“జెర్సీ” తో గ్రాండ్ గా మరోసారి నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో శరవేగంగా దూసుకుపోతూ ఇప్పటివరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఇదే విషయానికి సంబంధించి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. 

ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. దీంతో ఈ నెల 15న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో రాత్రి 7గంటల 30 నిమిషాలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా వెంకటేశ్ రానున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాతో నాని ఖాతాలోకి మరో హిట్ చేరడం ఖాయమని అంటున్నారు.

Related posts