telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

Sezal

టీవీ ప్రముఖ నటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై నగరంలోని మీరారోడ్డులో వెలుగు చూసింది. టీవీ ప్రముఖ నటి సెజల్ శర్మ తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సెజల్ శర్మ ‘దిల్ తో హ్యాపీ హై జీ’ టీవీ సీరియల్‌లో నటించారు. సెజల్ శర్మ గదిలో సూసైడ్ నోట్ లభించింది. సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకున్నపుడు ఆమె ఇంట్లో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. టీవీ నటి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ సీరియల్‌తో గుర్తింపు పొందిన ఈ నటి ఆత్మహత్య టీవీ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచివేసింది. సోజల్ శర్మ ఈ సీరియల్‌లో ‘సిమ్మీ ఖోస్లా’ పాత్ర పోషించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఉదయ్ పూర్‌నకు చెందిన సోజల్ యాక్టింగ్ మీద ఇష్టంతో ముంబైకి వచ్చి ఉంటున్నారు. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ ఆమెకు తొలి సీరియల్. దీనికిమందు ఆమె పలు ప్రకటనల్లో నటించారు. ‘వివో’ ఫోను ప్రకటనలో ఆమె హీరో అమిర్‌ఖాన్‌తో పాటు నటించారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అమిర్‌ఖాన్‌తో పాటు తాను ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రకటనలతో పాటు ఆమె ‘బీయింగ్ ఇండియన్’ అనే ఒక వెబ్ షోను కూడా చేశారు. ఈ షోలో ఆమె ‘స్వీటీ’ పాత్రను పోషించారు.

Related posts