telugu navyamedia
సినిమా వార్తలు

“రాక్షసుడు” మొదటిరోజు వసూళ్ళు

Rakshasudu

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్‌లో నటించిన మొదటి చిత్రం ‘రాక్షసుడు’. ‘రాచ్చసన్’ అనే తమిళ సైకో థ్రిల్లర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. బి, సీ సెంటర్స్‌లో కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ఆదరణ బాగుంది. బెల్లంకొండ ముందు సినిమాలతో పోలిస్తే దీనికి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్ తీసుకొచ్చాడు బెల్లంకొండ.. ఓవర్సీస్ నుంచి మరో 30 లక్షలు వచ్చాయి. మొత్తంగా తొలిరోజు 2.5 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చాడు ఈయన. సినిమాకు టాక్ బాగుంది కాబట్టి కచ్చితంగా శని, ఆదివారాల్లో ఇంకా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ప్రమోషన్స్ కూడా ఇలాగే చేస్తున్నారు. దాంతో ఇదే స్థాయి మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని నమ్ముతున్నారు. సినిమా సేఫ్ కావాలంటే 14 కోట్లు కావాలి. టాక్ ప్రకారం చూస్తుంటే అది పెద్ద కష్టమేం కాకపోవచ్చని అంటున్నారు. మరి చూడాలి ఈ చిత్రం ఎంత మేరకు వసూళ్లు రాబడుతుందో.

Related posts