telugu navyamedia
సినిమా వార్తలు

దొరసాని : “కలవరమై.. కలవరమై” లిరికల్ వీడియో సాంగ్

Dorasani

“దొరసాని” చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నారు. 80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, “నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే” పాట “దొరసాని”పై అంచనాలను పెంచాయి. తాజాగా “కలవరమై.. కలవరమై” అనే లిరికల్ వీడియో సాంగ్ వీడియో విడుదల చేశారు చిత్రబృందం. ఈ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. మరి మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts