telugu navyamedia
రాజకీయ వార్తలు

అనారోగ్య సమస్యలతో జపాన్ ప్రధాని..రాజీనామాకు సిద్ధమైన షింజో!

Japan Shinzo Abe

గత కొంతకాలంగా జపాన్ ప్రధాని షింజో అబే అనారోగ్య సమస్యలతో స్తామతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. తన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల టోక్యోలోని ఓ ఆసుపత్రి వైద్యులు దాదాపు ఏడు గంటలపాటు వైద్య పరీక్షలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రధాని పదవికి షింజో అబే రాజీనామా చేశాక ప్రస్తుత ఉప ప్రధాని తారో అసో తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.

Related posts