telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాక్ లో ఓ రాజకీయ నేతకు ఆరేళ్ల జైలు శిక్ష…

మనకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీ జమత్ ఉద్ దవా(జేయూడీ) సీనియర్ నేతకు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ నిర్ణయాన్ని యాంటీ-టెర్రరిజం కోర్టు వినిపించింది. ఈ నిర్ణయం ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న కేసులో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన మహమ్మద్ అష్రాఫ్‌కు 6 సంవత్సరాల జైలుతోపాటు, రూ.10వేలు జరిమానాను జడ్జి అర్షద్ హుస్సేన్ తన తీర్పులో పేర్కొన్నారు. మహ్మద్ అర్షాద్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా 2008 ముంబై ఎటాక్‌లో మహమ్మద్‌ను మాస్టర్ మైండ్‌గా నిర్ధారించింది. అయితే 2008 ముంబై ఘటనలో పాత్ర దారులైన ఇక్‌బాల్, ముజహిద్, అబ్దుల్ రెహ్మాన్‌లు పదిన్నర సంవత్సరాల జైలును ఖరారు చేసింది. ఇప్పటికి జేయూడీ నేతలపై దాదాపు 41 కేసులను వివిధ ప్రాంతాల్లో నమోద చేయబడ్డాయి. జులైలో దాదాపు 13 మంది జేయూడీ నేతలపై 24 ఉగ్రవాద సంబంధిత కేసులు వచ్చాయి. ఇవన్నీ పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం యాక్ట్ 1997 ప్రకారం నమోదుచేశారు.

Related posts