తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు వరద రాజకీయం చేస్తున్నారంటూ నిప్పులుచెరిగారు. ముఖ్యమంత్రి హోదాలో అక్రమ కట్టడంలో ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి అంటూ తనదైన శైలిలో విమర్శించారు. డ్రోన్ కెమెరాలంటే బాబుకు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు.
జగన్ పాదయాత్రలో డ్రోన్ లు ఉపయోగించినప్పుడు అప్పుడు తప్పని చంద్రబాబుకు తెలియలేదా అంటూ నిలదీశారు. చంద్రబాబును వైసీపీ టార్గెట్ చేసిందంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఎవరూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలే చంద్రబాబును టార్గెట్ చేసి ఇంటికి పంపించారని రోజా దుయ్యబట్టారు.
ఎన్నికల సంఘం ఏకపక్షం: యామిని