telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయాడు: బీజేపీ నేత లక్ష్మణ్‌

BJPpresident -K-Laxman

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఏఏని ఎందుకు వ్యతిరేకించారో కేసీఆర్‌ చెప్పాలని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఏ కారణంతో సీఏఏలో ముస్లిం పదం చేర్చాలని, అడుగుతున్నారో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయాడని ఆరోపించారు. జాతి వ్యతిరేక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాక్‌కు వంతపాడేలా ఎంఐఎం వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. సీఏఏపై ఎంఐఎం ఏకాకిగా మారిందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం సభలకు తెలంగాణ మంత్రులు హాజరవటం సిగ్గుచేటని లక్ష్మణ్‌ విమర్శించారు.

Related posts