telugu navyamedia
రాజకీయ

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేపై కాల్పులు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

*జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేపై కాల్పులు
*ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షింజో అబే మృతి..

జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే మృతి చెందాడు .షింజేపై దుండగుడు కాల్పులకు దిగాడు. దీంతో వెంటనే అతడిని  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జపాన్ మాజీ ప్రధాని షింజే మృతి చెందినట్టుగా స్థానిక మీడియా తెలిపింది. 

ఆదివారం పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు అబే. ఇదే సమయంలో వెనుకనుంచి వచ్చిన ఓ దుండగుడు అబే పై రెండు రౌండ్లు కాల్పులు జ‌రిపారు.

Watch: Shinzo Abe, Japan's former prime minister, shot, feared dead - World  News

దీంతో ఆయన ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు . ఈ ఘటనలో  తీవ్రంగా గాయప‌డిన  షింజే అబేను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలో అబే శ్వాస తీసుకోవడం లేదని, గుండె కూడా చలనం లేదని స్థానిక మీడియా తెలిపింది.

షింజో అబే…జపాన్ ప్రధానమంత్రిగా, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా 2006 నుండి 2007 వరకు.. మళ్లీ 2012 నుండి 2020 వరకు పనిచేశారు.అబే 2005 నుండి 2006 వరకు జునిచిరో కొయిజుమీ ఆధ్వర్యంలో చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2012లో కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగాషింజో అబేకి రికార్డు ఉంది.

Japan's Former Prime Minister Shinzo Abe In 'Cardiac Arrest' After Being Shot  In City of Nara

కాగా, జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని తెలుస్తోంది.

Related posts