telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బురద రాజకీయాలు మాకు చేతకాదు..-పవన్‌కల్యాణ్

రైతులకు అండగా నిలబడటం జనసేన బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం తమకు తెలియదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు..బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులకు భవిష్యత్‌పై భరోసా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, రైతుల ఆత్మహత్యలే ఇందుకు ఉదాహరణ అని పవన్‌కల్యాణ్ మండిపడ్డారు.

రైతు ఆత్మహత్యలను వైసీపీ రాజకీయకోణంలో చూస్తోందన్నారు. నష్టాలు, రుణభారంతో రైతులు కుంగిపోతున్నారని తెలిపారు.ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామన్న హామీ ఏమైందని పవన్ ప్రశ్నించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

వ్యవసాయరంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తప్పుబట్టారు.. భూ రికార్డుల్లో పొరపాటు వల్లే రైతు ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆంజనేయలు సమస్యలపై కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చినా… అధికారులు స్పందించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

Related posts