telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబు జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం..-బుద్దా వెంకన్న

*టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
*చంద్రబాబును తిడితే చంపడానికైనా, చావడానికైనా సిద్ధం
*చంద్రబాబు జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తాం..
*వంద‌మందితో సూసైడ్ బ్యాచ్‌ను సిద్ధం చేశాం

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎవరైనా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుధవారం నాడు బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుపై చెత్త వాగుడు మానుకోవాల‌ని ,వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేసుకున్నామని తెలిపారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని, వైసీపీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా కోరారు..

టీడీపీ నేతల్ని తిడితే … టీడీపీ ఆఫీసుపై దాడులు చేస్తే పదవులు వస్తాయని అనుకుంటున్నారనిని మండిపడ్డారు. 

సీనియర్లను కాదని జోగి రమేష్‌కు మంత్రి పదవి ఎలా వచ్చిందని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లినందుకే జోగి రమేష్‌కు పదవి వచ్చిందని వైసీపీ నేతలే చెబుతున్నారని బుద్దా వెంకన్న గుర్తు చేశారు.  ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Related posts