telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆ వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా చెబుతారు ..ఏ ఫోరెనిక్స్ ల్యాబ్ చెప్పిందో బ‌య‌ట‌పెట్టండి..

*ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై నారా లోకేష్ రియాక్ష‌న్‌..
*ఫేక్ అని ఎస్సీ ఎలా తేల్చారో చెప్పాలి..
*ఏ ఫోరెనిక్స్ ల్యాబ్ చెప్పిందో బ‌య‌ట‌పెట్టండి

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఎస్పీ ఫకీరప్ప వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేష్ త‌ప్పు బ‌ట్టారు.

ఎస్పీ ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టా అని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ ఫోరెనిక్స్ ల్యాబ్‌ నివేదిక ఇచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని లోకేష్ ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు మహిళల్ని కించపరుస్తున్నారని.. తన తల్లిని కించపరిచారన్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తనను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు.

Related posts