telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచండి: సీఎం జగన్

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన పెంచండని ఏపీ సీఎం జగన్ సూచించారు. రాష్ట్రంలో మార్చి 31 వరకు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా థియేటర్స్ ను మూసేశామని తెలిపారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా… ప్రజల్లో అవగాహన పెంచాలని, వారిలో అపోహలను తొలగించాలని ఆదేశించారు.ప్రజల మధ్య సామాజిక దూరంపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని జగన్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నిత్యావసరాల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో పరిశుభ్రతను పాటించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో పారాసిటమాల్, యాంటీ బయోటిక్స్ ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

Related posts