తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత పెరిగింది. ఇప్పటికే మనస్థాపం చెందిన ఆర్టీసీ కార్మికులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరి కొందరు ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రుల పాలయ్యారు. ఇంకొందరు గుండెపోటుతో మృతి చెందారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ స్పందించిన దాఖలాలు లేవు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ గవర్నర్ తమిళిసై ని కలిశారు. తమ సమస్యలు పరిష్కరించటానికి చొరవ చూపాలని వినతి పత్రాన్ని ఆమెకు అందించారు. తాము న్యాయపరమైన డిమాండ్లతోనే ఈ సమ్మె ప్రారంభించామని, కానీ తమ సమస్యలను పరిష్కరించకుండా సీఎం కెసిఆర్ తన మొండి వైఖరితో తమ జీవితాలని నాశనం చేస్తున్నాడని గవర్నర్ కు చెప్పుకున్నారు. ప్రభుత్వానికి మీ వంతు సలహాలు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు తెలంగాణ గవర్నర్ తమిళిసై కి మొరపెట్టుకున్నారు.
టిఎస్‌ఆర్‌టిసి సమస్యపై జోక్యం చేసుకోవాలని, కార్పొరేషన్‌ను ప్రభుత్వంతో విలీనం చేయడం సహా అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని టిఎస్‌ఆర్‌టిసి జెఎసి గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను కోరారు. అశ్వత్థామ రెడ్డి నేతృత్వంలోని టిఎస్‌ఆర్‌టిసి జెఎసి నాయకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకుని కార్పొరేషన్‌లో కొనసాగుతున్న సమ్మె గురించి వివరించారు. తమ చట్టబద్ధమైన డిమాండ్లతో అక్టోబర్ 5 నుండి కార్మికులు సమ్మెలో ఉన్నారని చెప్పారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారుఆర్టీసీ కార్మికులు . ముఖ్యంగా కార్మికులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే బాగుంటుందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. అయితే తెలంగాణలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చలించటం లేదని వారు తమిళి సై కి విన్నమించారు.
తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు: ఎంపీ బండి సంజయ్