telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్…

ఈ రోజు ఐపీఎల్ 2020 లో అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సన్‌రైజర్స్. దాంతో కోల్‌కత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు గత మ్యాచ్ లో ఓడి ఇందులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే హైదరాబాద్ రన్ రేట్ కారణంగా కోల్‌కత ను వెనక్కినెట్టి 4 వ స్థానంలోకి వస్తుంది. మరి ఎవరు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారు అనేది చూడాలి.

కోల్‌కత : రాహుల్ త్రిపాఠి, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (w), ఇయాన్ మోర్గాన్ (సి), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, శివం మావి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

హైదరాబాద్ ; డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టి నటరాజన్, బాసిల్ తంపి

Related posts