telugu navyamedia
క్రీడలు

భారత్ vs న్యూజిలాండ్ సూపర్ మ్యాచ్ నేడే

టీమ్ ఇండియా సమరానికి సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2021 లో 28 వ మ్యాచ్‌లో భాగంగా సూపర్ 12 మ్యాచ్‌లో ఆదివారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంలు తలపడనున్నాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌ని ఇరు జట్లకు వర్చువల్ నాకౌట్‌గా పరిగణిస్తున్నారు. నాకౌట్‌ దశకు చేరాలంటే.. ఈ మ్యాచ్‌లో గెలవడం.. రెండు జట్లకు కీలకం. ఈ గేమ్‌లో ఎవరు గెలిస్తే వారు మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గత ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ​ భార‌త్ ఘోర ఓట‌మి పాలైంది. న్యూజిలాండ్​తో త‌ల‌ప‌డి ఏలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో టీమిండియా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

IND vs NZ Dream11 prediction: Best picks for ICC Men's T20 World Cup 2021, India  vs New Zealand match in Dubai

 ఈ నేపథ్యంలోనే కివీస్​పై గెలిచి రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. అయితే క్రికెటర్ల ప్రదర్శనతో పాటు టాస్ ​ గెలవడం కూడా విజయంలో కీలకంగా మారింది. ఎందుకంటే.. టాస్‌ గెలిస్తే సగం పనైట్లే…

 అయితే ఐసీసీ టోర్నీల్లో రెండు దశాబ్దాలుగా టీమ్  ఇండియాకు షాకిస్తోంది కివీస్. 2003 తర్వాత ఐసీసీ నిర్వహించిన ఒక్క టోర్నీలో కూడా న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించలేదు. అయితే న్యూజిలాండ్ ఈసారి కూడా తన విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. దీంతో తన రికార్డును మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది.

టీమ్  ఇండియా 2003 వన్డే ప్రపంచకప్ లో చివరిసారి గంగూలీ కెప్టెన్సీలో కివీస్ ను ఓడించింది భారత్. మెగా టోర్నీల్లో టీమిండియా అన్ని మేయిన్ టీమ్స్ ను మట్టికరిపించినా… కివీస్ ను మాత్రం ఓడించలేకపోయింది. ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్  ఫైనల్లోనూ కోహ్లీసేన ఓటమిపాలైంది. అయితే పాక్ చేతిలో ఈ రెండు టీమ్స్ ఓడటంతో… తీవ్ర ఒత్తిడిలో ఉండనున్నాయి. దీంతో భారత్‌, న్యూజిలాండ్‌(IND vs NZ T20 Match) అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలుపు ఎవ‌రిది అనేది కొద్ది గంట‌లు ఆగ‌ల్సిందే..

Related posts