telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : రాణించిన రానా… చెన్నై లక్ష్యం..?

ఐపీఎల్ 13 వ సీజన్ లో ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కత నైట్ రైడర్స్ మధ్య దుబాయ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత జట్టులో ఓపెనర్ నితీష్ రానా రాణించాడు. శుబ్మాన్ గిల్(26) పరుగులకే వెనుదిరిగిన రానా మాత్రం అంద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ లో 61 బంతుల్లో ఎదుర్కున్న రానా 87 పరుగులు చేసాడు. కానీ ఆ తర్వాత వచ్చిన వచ్చిన వారిలో కార్తీక్ (21) చేసిన పరుగులే అత్యధికం. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో లుంగి ఎన్గిడి రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, కర్న్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే చెన్నై173 పరుగులు చేయాలి. ఇప్పటికే ప్లే ఆఫ్ నుండి తప్పుకున్న చెన్నై జట్టు లీగ్ నుండి వెళ్లేముందు మర్యాదగా వెళ్లిపోవాలని చూస్తుంది. కానీ కోల్ కత కు మాత్రం ప్లే ఆఫ్ కోసం ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. చుడాలిమరి ఈ మ్యాచ్ ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts