telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో తెలంగాణలో 203 మంది అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల అధికారిక వైబ్‌సైట్‌లో మిస్సింగ్ కేసుల వివరాలను పొందుపరిచింది. నిన్న ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65మంది అదృశ్యం అయినట్లు పేర్కొన్న పోలీసులు..నిన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 8 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఈ నెల 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62 కేసులు,  28న 65 కేసులు ఈ రోజు 11 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. వివిధ కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు  పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు..విచారణ మొదలు పెట్టారు. కాగా ఇటీవలే దీక్షిత్ రెడ్డి అనే బాలున్ని కిడ్నాప్ చేసి చంపిన విషయం తెలిసిందే. దీక్షిత్‌ను ఎత్తుకెళ్లిన నిందితుడు మంద సాగర్‌… కే సముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై తీసుకెళ్లి.. బాలుడి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

Related posts