telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 31, ఆదివారం రాశిఫ‌లాలు..

మేషరాశి..
కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విందులలో పరిమితి పాటించండి. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రయాణాలలో అప్రమత్తత అవసరం..

వృషభ రాశి..
స్థిరాస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులకు విశ్రాంతి లభిస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు ఆలస్యంగా సఫలమవుతాయి.

మిధున రాశి..
కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మిత్రుల రాక పోకలు ఆనందం కలిగిస్తుంది.

కర్కాటక రాశి..
బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. రుణ యత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు.

సింహం..
చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానవస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి..
శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికీ అభివృద్ధి ఉంటుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. వ్యాపారవర్గాల వారిమాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.

తులరాశి..
అప్పులు తీరుస్తారు. స్త్రీలు, బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలందిస్తారు. రావలసినధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.

వృశ్చిక రాశి..
బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. శతృవులపై విజయం సాధిస్తారు. మీ సోదరుల తీరు మీకెంతో మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు.

ధనస్సు రాశి..
ఆకస్మిక ధన లాభం పొందుతారు. చేపట్టిన పనులలో విజయంసొంతం చేసుకుంటారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదుటపడతారు. కానివేళలో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు.

మకర రాశి..
మానసిక ఆందోళన కలుగుతుంది. వృత్తి రీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి.

కుంభ రాశి..
అధిక వ్యయప్రయాసలకు గురవుతారు. స్వల్ప అనారోగ్య బారిన పడతారు. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది.

మీనరాశి..
చేపట్టిన ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. స్త్రీల వలన లాభం పొందుతారు. రుణబాధలు తీరతాయి. కోళ్ళ, మత్స్య పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఆత్మీయుల రాక సంతోషపరుస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.

Related posts