telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 01, సోమవారం రాశిఫ‌లాలు..

మేష రాశి..
ఒకేకాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తత అవసరం.. కొత్త పనులు చేపట్టేవారు వాయిదా వేసుకోవడం మంచిది. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు ఎక్కువ‌గా ఉంటాయి.

వృషభ రాశి..
అప్పులు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఆలస్యంగా సఫలమవుతాయి.

మిధున రాశి..
స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. క‌లప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి. సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి..
వ్యాపార రంగాల్లో పోటీ పెరగడం వల్ల అందోళనకు గురవుతారు. ఆరోగ్య బారిన పడే అవకాశం ఉంది. ధన వ్యయంతో రుణప్రయత్నాలను చేస్తారు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

సింహ రాశి..
విందువినోదాలులో సంతోషంగా గ‌డుపుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. క్రీడారులకు, రాజకీయ రంగాలలోని వారికీ ఈరోజు అనుకూలంగా ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

కన్య రాశి
దూరప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు.కాంట్రాక్టర్లకు పనివారలతో ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు అనవసర ప్రసంగాలు చేయటంవల్ల మాటపడక తప్పదు.రాబడికి మించి ఖర్చులు చేస్తారు.

తుల రాశి..
ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబం పరిస్థితి సంతోషాన్ని కలిగితుంది. అప్పులు తీరుస్తారు. స్త్రీలు, బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు.

ధనుస్సు రాశి..
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో విజయంసొంతం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.ఇంటాబయటా చిక్కులు ఏర్ప‌డ‌తాయి.

మకర రాశి..
రుణయత్నాలు చేస్తారు. అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. మానసిక ఆందోళన కలుగుటఁది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.మీ అభిప్రాయాలు, ఆలోచనలు, గోప్యంగా ఉంచడం క్షేమదాయకం.

కుంభ రాశి..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అధిక వ్యయప్రయాసలకు గురవుతారు. స్వల్ప అనారోగ్య బారిన పడతారు.సన్నిహితులతో వివాదాలు తీరతాయి.వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది.

మీన రాశి..
స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.చేపట్టిన ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. స్త్రీల వలన లాభం పొందుతారు. రుణబాధలు తీరతాయి.. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితులతో కలిసి పలు కార్యమ్రాలలో పాల్గొంటారు.

 

Related posts