telugu navyamedia
రాజకీయ వార్తలు

రూ.3.5 లక్షలలోపు గృహ రుణాలపై వడ్డీ మాఫీ: నిర్మల సీతారామన్

Nirmala sitaraman budget

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంటి రుణాలపై రూ.3.5 లక్షల వరకూ ఉన్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలను ఆమె అభినందించారు. డ్వాక్రా మహిళలకు రూ.5000 వరకూ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని 18 దేశాల్లో రాయబార కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించామనీ, వాటిలో ఐదింటిని ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభం నుంచి ఊరట కల్పించమని పేర్కొన్నారు.

బడ్జెట్ 2019-20 హైలైట్స్:

-ఇంటి రుణాలపై వడ్డీ తగ్గింపు.. రూ.3.5 లక్షల వరకూ ఉన్న రుణాలపై వడ్డీ మాఫీ
-2019-20 నుంచి వార్షికాదాయం పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు
-అంటే రూ.5 లక్షలకు మించి ఆదాయం పొందేవారే పన్ను కట్టాల్సి ఉంటుంది
-ఎలక్ట్రానిక్ వాహనాలు కొంటే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తాం
-ఐటీ రిటర్నుల దాఖలు పాన్ లేదా ఆధార్ ఉంటే చాలు
-స్టార్టప్ కంపెనీలకు ఐటీ శాఖ తనిఖీల నుంచి మినహాయింపు
-గృహ రుణాలపై అదనంగా రూ.లక్షన్నర వరకూ వడ్డీ తగ్గింపు
-2018-19లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.11.37 లక్షల కోట్లకు చేరింది
-అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం
-డ్వాక్రా సంఘాలకు దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ పథకం

Related posts