ఈరోజు వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య లీడ్స్ లో మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానం మీదుగా వెళ్లిన చిన్న విమానం ప్రదర్శించిన ఓ బ్యానర్ వివాదాస్పదమైంది. ఆ బ్యానర్ పై “కశ్మీర్లో భారత్ మారణహోమం ఆపాలి, కశ్మీర్ కు విమోచన కల్పించాలి” అనే నినాదం రాసి ఉంది. ఈ విషయంపై ఐసీసీ స్పందించింది. ఇలాంటి చర్యలను అంగీకరించబోమని, ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించామని ఐసీసీ వర్గాలు అన్నాయి. ఈ టోర్నీలో కొన్నిరోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు మ్యాచ్ ఆడుతుండగా ఓ విమానం “జస్టిస్ ఫర్ బెలూచిస్థాన్” అని రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ మైదానం చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో మైదానంలో ఉన్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు కూడా గొడవకు దిగారు.
Plane flying over cricket stadium carrying a banner “India stop Genocide and Free Kashmir” at #ICC #CWC19 event during a match between #INDvSL! pic.twitter.com/vywZpsLy7y
— پرنس کشمیری (@PrinceKashmiri_) July 6, 2019